Home Page

yprabhakarగవర్నమెంట్ ఎయీడ్ జూనియర్ కళాశాలలో చదువుచున్న విద్యార్ధులు ఎక్కువ మంది దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పిల్లలు తల్లిదండ్రులు పడుతున్న బాధను చూచి వారి కష్టాలలో తాము భాగస్వామ్యం కాలేక పోతున్నామోమూనన్ను బాధ ఉంటుంది. ఎక్కడైనా కూలి, నాలి చేసి వారిని ఆదుకోవాలనే భావన కూడా చాలా మంది విద్యార్ధులలో ఉంది. దీనికి తోడు పాఠ్యపుస్తకాలు, నోడ్సులు, పెన్నులు, పెన్సిల్ లు, బట్టల కొనుకోవడం వారికి ఎంతైనా భారమే. పుస్తకాలు లేకుండానే కాలేజీలకు వస్తుంటారు దానితో అధ్యాపకుల తిట్లు , చీదరింపులు భరిస్తారు. పుస్తకాలు కొనలేకపోవడం కుటుంబాల దుర్భర పరిస్థితికి నిలువుటద్దం .

అదే విద్య పై వారిలో నిర్లక్ష్యనికి దారి తీస్తుంది. ప్రతి సం||ము 20 నుంచి 30 మంది విద్యార్ధులు ఆడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పరీక్ష ఫీజులు చెల్లించలేని స్ధితిలో ఉన్న పేద పిల్లలు దాతల సహయంకోసం దీనంగా ఎదురుచుస్తున్నారు. అటు ప్రభుత్వ సహయం , ఇటు దాతల సహాయం దొరకని విద్యార్ధులు చదువుకుదూరమౌతున్నారు. సాటి అధ్యాపకుల, దాతల సహాకారంతో ఇప్పటి వరకు విద్యార్ధులకు అడ్మిషన్ ఫీజులు, ట్యుషన్ ఫీజులు, పరిక్ష ఫీజులు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిలు, బట్టలు అందించాము పేదరికంలో ఉన్నవారు చదువుకొలేకపోవడం. చదువుకోనివారు దారిద్ర్యం నుంచి బయట పడలేక పోవడం అనేది సామాజిక వాస్తవం. నిరక్షరాస్యులతో సత్వర పురోభివృద్ధి అసాధ్యం.

1. వికాస్ అంటే విద్యా వికాస్ ప్రతిభ గల పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించి ప్రోత్సహించడమే వికాస్ లక్ష్యం.

2. 2006 నుంచి ఇప్పటి వరుకు 56 మంది ఇంజనీరింగ్, ఫార్మశి, పాలిటెక్నిక్, బికాం, బి. ఏ, ఇంటర్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించాము.

3. వికాస్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి వుల్లంపర్తి శాంతరాజు స్మారక క్యాష్ అవార్డు రూ.5000లు 2006 నుండి ప్రతి సంవత్సరం ప్రతిభగల పేద విద్యార్ధులకు అందిస్తున్నాము.

4. మార్చి 2014  నుంచి ప్రతి నెల 60 మంది వృద్దులకు రూ. 200/-లు పింఛన్లు  పంపిణీ చేస్తున్నాము.

5. మార్చి 2014 నుంచి ఇప్పటి వరుకూ 18 మంది లబ్దిదారులైన వృద్దులు మరణించగా మట్టి ఖర్చులు నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 1000/- చొప్పున రూ.18000/- అందచేసాము.

Vikas Society Account No. 98390100004801, IFSC Code : BARB0EXTRAJ, Bank of Baroda, A.K.C.College Road, Rajahmundry.